2 వారాల్లో బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించండి : బీసీఐని ఆదేశించిన హైకోర్టు

2 వారాల్లో బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించండి : బీసీఐని ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల షెడ్యూల్​ను రెండు వారాల్లో సమర్పించాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ)ని  హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ తదితర వివరాలను అంద జేయాలని స్పష్టంచేసింది. విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తూ జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఆదేశాలను జారీ చేశారు.

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ప్రస్తుత సభ్యుల పదవీకాలం పూర్తయినప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ న్యాయవాది కొక్కుల అశోక్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పదవీ కాలపరిమితి ముగిసినా కొనసాగడం న్యాయవాదుల చట్టం–1961లోని సెక్షన్‌ 8, సెక్షన్‌ 54ల ఉల్లంఘనే అవుతుందన్నారు. ఎన్నికలు నిర్వహించకపోవడంపై గతంలోనే హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.